![]() |
![]() |
.webp)
అగ్నిపరీక్ష సీజన్ 2 హోరాహోరీగా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే.. ఫేక్ వర్సెస్ రియల్ టాస్క్. ముగ్గురు లీడర్లు శ్రష్టి, రాజకుమారి, అమన్ తమ టీమ్స్ ని సెట్ చేసుకున్న తర్వాత మొత్తం ఏడు రౌండ్లుగా ఈ గేమ్ సాగింది. ప్రతి రౌండ్ లో బయట నుంచి వచ్చిన గెస్టుల్లో ఎవరు రియల్, ఎవరు ఫేక్ అని కనిపెట్టాలి. ప్రతి కరెక్ట్ ఆన్సర్ కి పాయింట్స్ ఉంటాయి.
అలా ఫస్ట్ 3 రౌండ్లు ఇలా సాగాయి. రౌండ్-1 లో ఇద్దరి తలకాయలు మాత్రమే చూపించి పొట్టి ఎవరు, పొడుగు ఎవరు అని అడిగితే శ్రష్టి కరెక్ట్ గా చెప్పింది. రౌండ్- 2 లో రియల్ క్రోసాంటో ఏదో గెస్ చేయాల్సి రాగా మిథిలేష్, అపూర్వ విన్ అయ్యారు. రౌండ్ -3 లో రియల్ మెజీషియన్ ఎవరో చెప్పమంటే చరణ్, ఝాన్సీ, ప్రశాంత్ ముగ్గురు కరెక్ట్ గా చెప్పారు. నెక్స్ట్ 4 రౌండ్లు కూడా అంతే ఇంట్రెస్టింగ్ గా సాగాయి. రౌండ్ 4 లో రియల్ డోనట్ ని శ్రష్టి, రామకృష్ణ, ప్రియాంక గుర్తించారు. రౌండ్-5 లో రియల్ భరతనాట్యం అమ్మాయిని దీపక్, హేమంత్, రాజకుమారి కరెక్ట్ గా పట్టుకున్నారు. రౌండ్-6 లో రియల్ సన్ ఫ్లవర్ ని అమన్, మిథిలేష్, రోహిత్ విన్ అయ్యారు. లాస్ట్ 7వ రౌండ్ లో ఇద్దరు మహిళల్లో బిడ్డ తల్లి ఎవరో రాజకుమారి, అమన్, శ్రష్టి కరెక్ట్ గా చెప్పారు.
ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి స్కోర్లు దాదాపు ఈక్వల్ గా ఉన్నాయి. అప్పుడే భాగీ తన దగ్గర ఉన్న 'స్టీల్ ది హాఫ్' బ్లైండ్ కార్డుని యూజ్ చేసింది. అమన్ టీమ్ నుంచి సగం స్కోర్ ని లాగేసి తన టీమ్ అయిన రాజకుమారి టీమ్ కి యాడ్ చేసింది. దీంతో ఫైనల్ గా తొమ్మిదివందల మార్కులతో రాజకుమారి టీమ్ విన్ అయింది.
![]() |
![]() |